అందానికి ఆరోగ్యానికి ఆముదం చక్కని ఔషధం అంటారు వైద్యులు.ఇది సహజ క్లెన్సర్.ముఖం పై పేరుకున్న దుమ్ము ధూళి శుభ్రం చేస్తుంది.చర్మంలో తేలికగా ఇంకిపోయే గుణం ఉండటం వల్ల చర్మం నిగారింపు గా ఉంటుంది.వేడినీళ్లలో స్పూన్ ఆముదం వేసి ఆవిరి పడితే చర్మ కణాలు శుభ్రపడి ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది.పొడి చర్మ తత్వం ఉంటే రాత్రి వేల ముఖానికి రెండు చుక్కల ఆముదం రాసి మర్దనా చేసి అలా వదిలేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో మొహం కడుక్కుంటే చర్మం తేమగా ఉంటుంది.ముడతలు నల్లని మచ్చలు పోతాయి.పాదాల పగుళ్లు పైన ఆముదం రాస్తే చర్మం మృదువుగా అవుతోంది.మెడ చుట్టూ నలుపు పోవాలంటే ఆముదం లో ఆలివ్ నూనె, నిమ్మరసం కలిపి రోజు కొద్ది సేపు మర్దనా చేస్తే క్రమేపీ ఆ నలుపు పోతుంది.