సౌందర్య ఉత్పత్తుల్లో సింథటిక్ కలర్స్ థలేట్స్ పెట్రోలియం జెల్లీ, మైక్రోబీడ్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని దీర్ఘకాలం వాడితే చర్మం పాడైపోతుంది. షాంపూలు క్రీములు ,లిప్ స్టిక్ లలో పారా బెన్స్ తప్పకుండా ఇవి నిలువ ఉండేందుకు వాడతారు. దీని వల్లనే రొమ్ముల్లో కణుతులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. మన దేశంలో వేల సంవత్సరాల క్రితం నుంచి తులసి ,గంధం ,పసుపు వంటి ఎన్నో ఔషధాలున్న సౌందర్య కారకాలను ఉపయోగిస్తూనే ఉన్నారు. పువ్వులు,ఆకులు,కాందాలలో ఎంతో సువాసన గల అత్తర్లు తయారవుతున్నాయి. వేప ,కలబంద ,గులాబీ ,గోరింటాకు వంటి సహాజమైన ప్రకృతిలో దొరికే ఔషధ గుణాలున్న వాటినే ఉపయోగించుకోవటం అధ్యయనం చేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment