నీహారికా,

నువ్వెప్పుడైనా లాఫింగ్ క్లబ్ ని చూసావా. చాలా మంది పెద్దవాళ్ళు చుట్టూ నిలబడి ఏదైనా జోక్ చెప్పుకునో, లేదా ఊరికే నవ్వు తెచ్చుకునో నవ్వేస్తుంటారు. ఎందుకిలాగా నవ్వు ప్రాక్టీస్ చేయడం అంటే మనం నవ్వు మరచిపోతున్నాం కనుక అసలు నవ్వు ఒక పరిమళం, నవ్వు ఒక పూల సుగంధం. ఏ కాలేజీ కయినా పోయి చూడు టీనేజర్స్ గుంపు గా చేరితే చాలు దేనికో దానికి విరగబడి నవ్వేస్తుంటారు. ఆ వయస్సు గాలి తాకినా నవ్వోచేస్తుందేమో. మరి పెద్దయ్యాక ఎందుకీ నవ్వు మరచిపోతున్నాం. ఇప్పుడున్న కాలంలో తట్టుకోలేనంత వత్తిడి, స్ధాయి మించిన పోటీ తత్త్వం, వేగాన్ని అందుకో లేని నిస్సహాయత ఇవే మనిషిని నవ్వు నుంచి దూరం చస్తున్నాయి. అవసరాలు తీరితే చాలు అనుకోకుండా అంటూ లేని సౌకర్యాల కోసం డబ్బు సంపాదన మొదలెడుతున్నాం. ఇంకా తీరికేది? మనస్సుకి శాంతి ఏది. నింపాదిగా సంపాదించింది కుడా అనుభవించే అవకాశం లేని పరుగు అందుకే నవ్వు మరచిన వాళ్ళ కోసం ఈ లాఫింగ్ క్లబ్ లు. నవ్వుని నిలుపుకునే ప్రయత్నాలు చేయడం మంచిదేమో కదా.

Leave a comment