నాకు నేను ఎప్పుడూ ఫుల్ మార్క్స్ ఇచ్చుకుంటాను అంటుంది పూజా హెగ్డె. అందరిలోనూ కలిసిపోయే సమర్ధ్యం వుండటం నిజమైన అందం అంటోందామె. చక్కి సౌందర్యం నవ్వులో దాక్కుని వుంటుంది. అలాగే నేను ప్రాచీన గృహ చిట్కాలను విశ్వసిస్తాను. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. నా అనుభవం దృష్ట్యా కార్బోహైడ్రేడ్స్ తినడం మంచిదే. కార్బో పవర, చర్మం మెరుపుని పెంచేస్తుంది. అలాగే అతిగా చేసుకునే మేకప్ లు కుడా చర్మాన్ని దెబ్బతీస్తాయి. మన చుట్టూ వుండే గాలిలో కాలుష్యం వుంటుంది. ముఖం ఎక్కువగా నీళ్ళతో కడుగుతాను. మాయిశ్చురైజర్ అప్లయ్ చెస్తుంటా. మంచి కొబ్బరి నూనె తో ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటా. నాతో ఇప్పుడు వుండే సౌందర్య ఉత్పత్తులు లిప్ స్టిక్, మాయిశ్చురైజర్ మాత్రమే. అంటోంది పూజా హెగ్డె.

Leave a comment