నవ్వు గర్భాదారణకు అవకాశాలు మెరుగుపరుస్తాయి అంటోంది తాజా పరిశోధనలు. పిల్లల కోసం చికిత్స తీసుకునే వాళ్ళు హాయిగా మనసారా ఫక్కుమంటు నవ్వగలిగితే వారికి గర్భాదారణ అవకాశాలు ఎక్కువ అంటారు వైద్యులు. సాధరణంగా ఐ.వి.ఎఫ్ చికిత్స తీసుకునే వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు.ఈ ఒత్తిడి స్థాయి తగ్గి ప్రశాంతంగా ఉంటేనే మంచిది అంటారు.లాఫ్టార్ యోగా ఒత్తిడిని 27 శాతం తగ్గిస్తుంది. అలాగే హార్ట్ రేట్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి అనుకూల బావోద్వేగాలను 17శాతం పెంచుతుంది. ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ను మెరుగుపరచడంలో సహకరిస్తుంది. యాంగ్జైటీ తగ్గించేందుకు శరీరంలొ ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గించేందుకు చికిత్సగా దినిని ఉపయోగించుకోవచ్చు. గర్భాదారణ విషయంలోనూ నవ్వు ప్రయోజనం కనిపిస్తుంది అంటున్నారు వైద్యులు

Leave a comment