అస్సలు నవ్వకుండా, సీరియస్ గా మేధావి మొహం తో వుంటే డిగ్నిఫైడ్ గా ఉంటుందని చాలా మంది భావించి అలా ఎప్పుడూ నవోచ్చినా నవ్వకుండా మైంటైన్ చేస్తారు. కానీ నవ్వు మొహం తో వుండే వాళ్ళు హుందాగా కనిపిస్తారని అలా నవ్వుతూ పలకరించే వాళ్ళని అందరు నమ్ముతారని ఒక అధ్యాయినం రిపోర్టు. ఈ అధ్యాయినం లో కిక్ స్టార్టర్ ప్రచారం తీరుల్ని పరిశీలించారు. అందులో వ్యవస్థాపకులు మరీ ఎక్కువగా నవ్వుతు వుంటే ఇలాంటి వాళ్ళను విశ్వాసం లోకి తీసుకో లేదని తేలింది. అలా అని సీరీయస్ మేధావుల్ని నమ్మలేరు. సహజంగా నవ్వుతు మాట్లాడే వాళ్ళని అందరు నమ్ముతారట ఆ నవ్వు మొహంతో అవతలి వ్యక్తులతో కావాల్సిన పనులు చేయించుకోగలరట. ముఖ్యంగా మేనేజింగ్ ఫీల్డ్ లో వుండే వాళ్ళు తగు మోతాదు లో నవ్వు మొహంతో వుంటే బాగుంటుంది. అలాగే క్రియ విక్రయాలు కూడా నవ్వు మొహం తో నే సక్స్ స్ ఫుల్ గా అయిపోతాయి. కానీ నవ్వు మరీ వికట హాస్యం లా వుందా కూడదు. అతిగా కాకుండా నవ్వు మొహం చెల్లుతుందని నిపుణుల భావన.

Leave a comment