ప్రేమించే వాళ్ళ కోసం, భగవంతుడికి, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వాళ్ళకి ఇష్టంగా గులాబీల బొకె ఇస్తుంటారు. ఒక్కో రంగు గులాబీ ఒక్కో విషయానికి ప్రతీక.ఎర్ర గులాబీ ప్రేమ వ్యక్తం చేస్తుంది. పసుపు గులాబీ స్నేహానికి ప్రతీక, పింక్ గులాబీ ధన్యవాదాలు తెలుపుతుంది, తెల్ల గులాబీ శాంతికి సంకేతం నారింజ రంగు గులాబీ శక్తికి అభివృద్దికి గుర్తు, బావోద్వేగాలను చెప్పేస్తుంది. ప్రేమ వ్యక్తం చేసేందుకు చిరు నవ్వులు స్నేహ పూరిత వాతవరణం ఇవ్వగల రంగు గులాబీనే. ఈ రంగుల్లో ఇన్ని భావాలున్నాయని తెలియకపోయిన అందమైన గులాబీ ఎదుటి మనిషి ముఖంలో నవ్వులు పూయించే మాట వాస్తవం.

Leave a comment