వీచే గాలి లో బోలెడు రకాలున్నాయి. తుఫాన్ లా అదరగొట్టేస్తుంది. చలిగా వణికిస్తుంది. వేడిగా వడదెబ్బ తీస్తుంది. వసంత సమీరంలా హాయిగా ఉంచుతుంది. ఫ్యాషన్ లూ ఇలాంటివే. మొన్న మొన్నటి వరకు ఏ రాంప్ షో లో చూసినా టైట్ డ్రెస్సులు, తిగ్ట్ ఫిట్టింగ్ ల తో అమ్మాయిలు అష్ట కష్టాలు పది నడుస్తూ కనిపించే వాళ్ళు. ఇప్పిడు చూడండి ఏ షోలో అయినా ఒక్కటే పై నుంచి కింద వరకు వదులుగా వేళ్ళాడే డ్రేస్సులే. ఫ్యాషన్ ప్రపంచపు హాట్ టాపిక్ పేపర్ బ్యాగ్ స్కర్టులు, ప్యాంట్లు. నడుము దగ్గర నుంచి కిందకు లూజు గా నెల పైన జీరాడే స్కర్టులు కనిపిస్తాయి. వీటికి మ్యాచింగ్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే టాప్ లు. ఈ పేపర్ బ్యాగ్ స్కర్టులు, ప్యాంట్లు అయితే ఫ్లాట్ గా చక్కగా కనిపిస్తాయి. కొంచం బొద్దుగా వున్న వాళ్ళకి చాలా అందంగా వుంటాయి. బొద్దుతనం కనబడకుండా లూజు కుచ్చుళ్ళ లంగా మాదిరిగా  లెహంగా లాగానూ సాదా సిల్క్ తో కుట్టిన ఈ డ్రెస్సు ఈ సమ్మర్ ఫ్యాషన్.

Leave a comment