మొహం తో పాటు మెడ భాగంలో వుండే మృదువైన చర్మంపైన కూడా దృష్టి పెట్టండి లేకపోతే అక్కడ గీతాలు,ముడతలు వచ్చేసి వయసు పెరిగినట్లు అయిపోతుంది అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్ . ఎండలోకి వెళ్ళేప్పుడు ముఖంతో పాటు మెడకు కూడా సన్ స్క్రిమ్ లోషన్ రాసుకోవాలి. సన్ స్క్రిమ్ వాడటం వల్ల చర్మం పైన ముడతలు ఏర్పడవు. స్నానం చేసాక మెడకు కూడా మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. అలాచేస్తే మెడభాగంలోని చర్మానికి పోషణ ఉంటుంది. మొహానికి  మాస్క్ వేసుకొన్నపుడు అలాగే మెడకు నెక్ ప్యాజెన్ వేసుకోవాలి . ఈ ప్యాజెన్ మేడపైన గీతాల్ని ముడతల్ని తగ్గించి చర్మానికి తాజాతానం ఇస్తాయి.

Leave a comment