నీటి ఏటీఎం తో ప్రారంభించి లీటర్ నీటికి 25 పైసలు వసూలు చేస్తూ పేద వారికి సాయం చేస్తున్నారు చిన్మయి ప్రవీణ్ కర్ణాటక లోని చిన్న పల్లెటూరు ఆమెది మురికివాడల్లో తాగునీటి లోపాన్ని చూశారు చిన్మయి. మారుమూల గ్రామాల్లోనూ తాగు నీళ్లు కరువే. 2019 లో గెవిన్ వాచ్ స్టమ్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు చిన్నయి. ముందుగా సొంత ఖర్చుతో పూణే నుంచి యంత్రాన్ని తెప్పించి శ్రీరాంపురం లో 24 గంటలు అందుబాటులో ఉండే వాటర్ ఏటీఎం లు ఏర్పాటు చేశారు. చిన్న మధ్య తరహా సంస్థల విభాగపు సాయంతో 16 జిల్లాల్లో 900 పైగా ఎటిఎం ఏర్పాటు చేసింది. నిర్వహణ సర్వీస్ వరకు పూర్తిగా మహిళలు చేసుకునే ప్లాంట్లు ఉన్నాయి. ప్రతి బుధవారం నీళ్ళు ఉచితంగా అందుతాయి. ఈ మూడేళ్లలో ఉత్తమ వ్యాపారవేత్త తో సహా ఎన్నో అవార్డులు అందుకుంది చిన్మయి ప్రవీణ్.

Leave a comment