అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా ,కాలం గడుస్తున్నా కొద్దీ నా జర్నీలో నాకు సినిమా పైన చాలా ఇష్టం కలిగింది . సినిమా మాధ్యమంలో ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావచ్చని తెలుసుకోన్నా . ఇక ఏ అభిమానాన్ని వదులుకోలేక పోయా అంటోంది నిత్య . ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ ఉండదని  మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ ఒక్క చోటేకాదు,అన్ని సెక్టర్స్ లోనూ మహిళల పై గౌరవం తక్కువే . నా కెరీర్ లో నాకు చాలా సార్లు భద్రత లేదనిపించింది . ఆ సందర్భాల్లో నేను ఊరుకోలేదు “కాస్త హుందాగా ప్రవర్తించండి “అని ఘాటు గానే స్పందించాను . ఏదైన ఇబ్బంది వస్తే నిర్మొహమాటంగా మన నిర్ణయం చెపితే ,అసలు ముందు మనం స్పందిస్తే ఇతరులు ముందుకొచ్చి మాటసాయం చేస్తారు . ముందు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి . చెదిరి పోవల్సిన అవసరం లేదు అంటోంది నిత్య

Leave a comment