సినిమాలో నటిస్తూ ఉండగానే సావిత్రి గారికి నాకు ఎంతో దగ్గరి పోలికలు ఉన్నట్లు అనిపించింది అంటుంది కీర్తి సురేష్. మహానటి సావిత్రి పాత్రను పోషించేందుకు చేసిన హోంవర్క్ లో భాగంగా ఆమె కూతురు విజయా చాముండేశ్వరిని కలుసుకున్నాను.  సావిత్రి గారికి స్మిమ్మింగ్ ఇష్టం ,టీ ఇష్టం, క్రికెట్ ఆడేవారు ,కారు డ్రైవింగ్ ఇష్టం.  ఇవన్నీ నాకు ఇష్టం. అచ్చం నేను సావిత్రిగారి జీవితంలో తను ఇష్టపడినవన్నీ ఇష్టపడుతున్నాను.  సేమ్ టూ సేమ్ సావిత్రి గారి లాంటి దాన్నేఅంటుంది కీర్తీ సురేష్.  సాధారణంగా ఒక పాత్ర నటించేప్పుడు అందులోకి పరకాయ ప్రవేశం చేస్తారంటారు కదా కీర్తీ అదేపని చేసింది.  నేను అచ్చం ఆమె లాగా అనటంతో సినిమా ఎంత చక్కగా రాబోతుందో తెలుస్తోంది

Leave a comment