పెళ్ళి చూపులు సినిమాతో చిత్ర పాత్రతో పరిచయం అయిన రీతూ వర్మకు ఈ మధ్యనే నంది అవార్డు వచ్చింది. కుటుంబం స్నేహితులు సంగీతం ఇవే నా ప్రపంచం అంటుంది రీతూ వర్మ. బాగా తిని బాగా కసరత్తులు చేస్తాను. కొత్త వంటకాలు వండేందుకు ట్రై చేస్తా. బేసిక్ గా నేను చాలా సింపుల్ గా ఉండే అమ్మాయిని అంటుంది రీతూ వర్మ. ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాల్లో నటిస్తున్నా రీతూ ఇప్పుడు విక్రమ్ తో కలిసి ధృవనక్షత్రంలో నటిస్తుంది. పెళ్ళి చూపులు చిత్రంలో నటించారు కదా నిజ జీవితంలో పెళ్ళి చూపులు అయ్యాయా అని అడిగితే బహుశ నేను ప్రేమ పెళ్ళి చేసుకుంటాను .అరెంజ్ మ్యారేజ్ సెటప్ నాకు నచ్చలేదు అంటుంది రీతూ వర్మ

Leave a comment