నన్ను ఆమోదించిన తెలుగు ప్రేక్షకులకు నేను కృతజ్ఞతావాదినై ఉంటాను. నిజానికి తెలుగు తమిళం రెండు భాషలూ నాకు రావు. సినిమా అంగీకరించాక ఆ పాత్ర ని అర్ధం చేసుకోవాలంటే భాష భావం అన్ని తెలియాలి. నటించేప్పుడు అందుకు అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. డైలాగ్స్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాను. రికార్డ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకోగలిగే స్థాయిలో ఉన్నానంటే అదంతా నా హార్డ్ వర్క్ వల్లనే అంటోంది పూజా హెగ్డే. అలవైకుంఠపురం నేను ఇంతకు ముందు చేయని కామెడీ సబ్జక్ట్ నావరకు. నేను బాగాచేశాననే తృప్తి ఉంది. సాధారణంగా దేన్నయినా నేను పాజిటివ్ గా తీసుకొనే మనిషిని. ఒక వేళ అప్ సెట్  అయినా నవ్వుతో సరిపెడత నేను హ్యాపీ పర్సన్ ని ఈ సినిమా సక్సస్ తో మరింత హాపీ అంటోంది పూజా హెగ్డే.

Leave a comment