పదిహేనేళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో అప్ ఎండ్ డౌన్స్ రుచి చూసింది శ్రియ శరణ్. వరుస బెట్టి సినిమాలు చేస్తున్న నాకెప్పుడు బోర్ అనిపించలేదు. కానీ నన్ను ఇంకా నటిస్తారా అంటే మాత్రం విసుగ్గా ఉంటుంది అంటుంది శ్రియ. హాలీవుడ్ లో 60 ఏళ్ళు వచ్చే వరకు నటిస్తారు , ఇక్కడేమో 30 ఏళ్ళు వచ్చేస్తే రిటైరైపోమంటారు. కానీ నా విషయంలో నేను ప్లాప్ హీరోయిన్ ముద్ర ఎప్పుడూ వేయించుకోలేదు. అందుకే ఇన్నేళ్ళు నా కెరీర్ కొనసాగించుకొంటున్నాను. ప్లాప్ లు ,హిట్ లు నా ఎదుగుదలకు అడ్డంకిగా ఎప్పుడు లేవు. చిన్న పాత్రలు కూడా ఎందుకు అంగీరకరిస్తారని అడుగుతుంటారు నా మనసుకు నచ్చిన ఏదైనా చేస్తాను. ఇన్నీ సినిమాల తర్వాత నాకు డబ్బు దాహం అంటే ఎలా. హీరోయిన్ పాత్రల్లో నాకు అందిన పాత్రలు అన్నీ చేయటమే నాకు ఇష్టం అంటోంది శ్రియ శరణ్.

Leave a comment