నిజానికి నేను మార్పును పెద్దగా ఇష్టపడను. ఒకే ఆహారం తింటాను, అదే ఫ్రెండ్స్ తో కలుస్తాను. తమాషా ఏమిటంటే నాకెరీర్ ఈ తత్వానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అన్ని రకాల పాత్రలతో ప్రయోగాలు చేయాలి. ప్రతి నిమిషం కొత్తదనం సృష్టించగలగాలి అంటోంది సాయిపల్లవి. అది అలా ఉంచితే నా సినిమాల పట్ల నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి సినిమా ఒక అభ్యాస ప్రక్రియలాగా సాగింది. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయాలన్న భయం పోయింది. నాకు సినిమాలో ప్రాముఖ్యత ఉండి ,ప్రభావితం చేయగల ఏ పాత్ర అయినా ఇష్టమే .సినిమాల నుంచి నేను సంతోషాన్ని కోరుకోంటున్నాను. ప్రేక్షకులు నేను బాగా చేశానని ప్రశంసిస్తే సక్సెస్ సాధించినట్లే. దియ సినిమాలో అమ్మగా నటించాను. ఒక మంచి అమ్మను నాలో చేశానని ప్రశంసలు అందుకోవటం చాలా సంతోషాన్ని ఇబ్బంది అంటోంది సాయిపల్లవి.

Leave a comment