సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించడమే నా అందం రహస్యం అంటుంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్థుతం హలో గురూ ప్రేమ కోసమే లో నటిస్తున్న అనుపమ తనకు ఫ్యాషన్ విషయం ముందే ఉండాలని పట్టింపులేవు అంటుంది. నేను ఇవ్వాల్టి తరం అమ్మాయిని డైరక్టర్ ఒక పాత్ర గురించి చెప్పగానే అందులో ఎలా కనిపిస్తే బావుంటుందో ఊహించేస్తాను. అందం అంటే స్లీవ్ లెసుల్లో ఉండదు.పాత్రోచితంగా పాత్ర ని బట్టి అర్ధం చేసుకుని అలా కనిపించాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా కనిపించాలో ప్రయత్నిస్తా. అదే సమయంలో నా సౌకర్యం కూడా చూసుకుంటా అప్పుడే నాకు ఆ పైన విశ్వాసం వస్తుంది అంటుంది అనూపమ.తనకు వ్యతిరేక చాయలున్న పాత్రలో నటించాలంటే చాలా ఇష్టం అంటుంది.

Leave a comment