మనుషులలో ఎదుగుదల, మెదడు చైతన్యంగా ఉండటం జ్ణాపకశక్తి మొదలైనవి నిరంతర ప్రక్రియలు. పిల్లల వయసుతో పాటు ఇవన్ని పెరుగుతాయి. కనుక వారికి ఊహాశక్తిని పెంచే బొమ్మలు ఇవ్వాలి. లెక్కలు, భాషా నైపుణ్యాన్ని పెంచుకునే చార్ట్ లు, పరికరాలు అందుబాటులో ఉంచాలి. పెద్దవాళ్లు పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి. ఆల్ఫబెట్స్ ఈజీగా నేర్చుకోగలిగే ఫజిల్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపకరిస్తాయి. వాళ్లు ముందుగా బొమ్మలతో ఆ తర్వాత తమ తోటి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యేలా ఈ బొమ్మలు ఉపకరిస్తాయి. ఆ సమయంలో వారిని తోటివారితో ఆడుకోనిస్తే పిల్లలు పరస్పరం షేర్ చేసుకోవడం, సహకరించుకోవడం, ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడం వంటివి నేర్చుకుంటారు. ఈ సమయంలో మన పిల్లలు దురుసుగా వ్యవహరిస్తున్నా దాన్ని సరిదిద్ది ఆస్వభావాన్ని మరల్చే బాధ్యత పెద్దవాళ్ళాదే. బావోద్రేకాలు అదుపులో పెట్టుకునే తర్ఫీదు ఇచ్చేది ఇప్పుడే.

Leave a comment