Categories
పసుపు రాయడం వల్ల చర్మానికి రంగు కాంతి వస్తుందని అనుకుంటారు కానీ నేరుగా పసుపు చర్మానికి రాయడం వల్ల మచ్చలు, చారలు వస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. పసుపును పెరుగు, పెసర పిండిలో కలిపి పట్టించాలి ఇలా చేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. దాన్ని కూడా ఎక్కువసేపు ముఖంపై ఉంచుకోకూడదు. ఆరిన వెంటనే సాధారణమైన నీటితో కడిగేయాలి. సబ్బు ఫేస్ వాష్ లు వాడకూడదు. సబ్బు వాడితే ముఖం ఉన్న రంగు, రంగు కంటే మరింత నల్లగా కనిపిస్తుంది. పసుపు ఒక సహజమైన ఔషధం నేరుగా తీసుకున్న రక్తంలోని మలినాలు తొలిగిపోతాయి. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. చర్మం తేటగా అవుతుంది.