అకౌంటెంట్ గా పనిచేస్తున్న వర్షా వేద్ కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చి చూపు పోయింది. దాతల కోసం పేరు నమోదు చేసుకున్న రెండేళ్లకు ఆమెకు కళ్ళు దొరికాయి. మూడేళ్లపాటు ఈ కళ కోసం ఆమె పడిన తపన ఆమెకు జీవితాదర్శన్ని ఇచ్చింది. గత 18 సంవత్సరాలు వర్ష వేద్ నేత్రదాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. ఐ బ్యాంకు కోఆర్డినేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో శిక్షణ తీసుకుని నేత్రదానం గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఏ ఆస్పత్రిలో రోగి మరణించిన ఆమె రోగి బంధువులను ఒప్పిస్తారు. అలా కొన్ని వందల మందికి చూపు తెప్పించారు వర్షా వేద్ కొన్ని వేల మంది చేత నేత్ర దానానికి వాగ్దానం చేయించారు.

Leave a comment