మెరిసే పట్టు వస్త్రం,పింగాణీ,పాలిమర్ క్లే తో చేత్తోనే తయారు చేసిన అత్యంత సహజంగా కనిపించేలా ఆయిల్ పెయింటింగ్ వేసిన ఈ అందమైన పువ్వులు ఎప్పటికీ వాడవు. ఎంతో దగ్గరగా వచ్చి పరీక్షగా చూస్తే తప్ప ఈ రియలిస్టిక్ ఫ్లవర్ క్లిప్పులు నిజం పూవు కాదని కనిపెట్టాం చాలా కష్టం రంగు రంగుల గులాబీ పూవులు,మొగ్గలు చామంతులు, గన్నేరులు, కనకాంబరం వంటివి ఎన్నో రకాల కృతిమ పుష్పాలతో రకరకాల మోడల్ క్లిప్పల్ని తయారు చేస్తున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు. వీటిని పెళ్లిళ్లు,ఫంక్షన్ లలో వాడుతున్నారు. డ్రెస్ మ్యాచింగ్ గా ఉండేలా వీటిని ఎంచుకోవచ్చు. ఈ పూల అందం ఎప్పుడు తాజాగానే ఉంటుంది.

Leave a comment