లెదర్ బ్యాగ్ ఏ డ్రస్ పైకి అయినా మంచి ఎంపిక .అయితే వీటి మన్నిక విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొంటే అవి ఎప్పుడు కొత్త వాటిలా ఉంటాయి. రెగ్యులర్ గా వాడే బ్యాగ్ పైన ఏవేవో మరకలు పడుతూనే ఉంటాయి. వీటిని అరటిపండు తోక్కతో రుద్ది పొడి టిష్యుతో తుడిచేసి తెల్లని బ్యాగ్ పైన బాల్ పెన్ మరకలు కనిపిస్తూ ఉంటే గోళ్ళరంగు రిమూవర్ లో దూదిని ముంచి ఆ ప్రాంతంలో రాస్తే ఆ మరకులు పోతాయి.నూనె ,గ్రీజు మరకలు పడితే ఆ మరకలపైన వంటసోడా ,మొక్కజోన్న పిండి చల్లాలి.దూదిలో తుడిచేస్తే మరకలు మాయమైపోతాయి.నల్లని మరకలు కనబడితే తెలుపు రంగు బూట్ పాలిష్ అద్ది స్పాంజితో శుభ్రం చేస్తే బ్యాగ్ కొత్త దానిలా కినిపిస్తుంది. వారానికి ఒక సారి బ్యాగ్ గోరువెచ్చని నీటిలో తడిపిన మెత్తని వస్త్రంతో తుడిచేసి ఏ టేబుల్ పైన ఉంచాలి. బీరు వాల్లోనూ ,లోపల పెడితే ,ఫంగస్ వచ్చేసి బ్యాగ్ కొత్తదనం పోతుంది.

Leave a comment