ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో ఖాదీ డ్రస్ లతో సమంత లుక్ అందరినీ ఆకట్టుకొంది. చక్కని పసుపు రంగు ఖాదీ వర్క్ జాకెట్,ఫ్లోరల్ ప్రింటు ప్యాంట్ తో ఆమె చాలా అందంగా ఉంది.సాధారణంగా ఖాదీ పార్టీ వేర్ గా బావుండదు అనుకుంటారు. కానీ డిజైన్ చేసిన తీరుతో ఆ వస్త్రశ్రేణి అందం ఇమిడి ఉంటుంది. అంత క్లాసీ లుక్ ఇంకే దుస్తుల్లోనూ కనిపించదు. కాంట్రాస్ట్ రంగులతో కూడిన టాప్ బాటమ్ ఎంచుకుంటే ఎంతో బావుంటుంది కూడా ఈ డ్రెస్ పైకి ఖాదీ అలంకరణలు కూడా అక్కర్లేదు సింపుల్ గా టెర్రికోటా ఆభరణాలు చాలు ఖాదీ టాప్ పలాజో లు కలిపితే ఆధునికంగా కనిపిస్తారు అదే హుందాగా ఉండాల అనుకుంటే పూర్తి తెలుపు రంగు దుస్తుల్లో మరింత ఎట్ట్రాక్ట్ గా కనిపించవచ్చు. ఖాదీ ఎప్పటికీ చక్కని ఎంపిక.

Leave a comment