ప్రతీదీ బావుండాలి. ప్రతీ దానిలో ఫ్యాషన్ వుంది తీరాలి. అది కళ్ళ కాటుక కైనా, కల్లజోడైనా సాదా సీదాగా వుండే ఏం బావుంటుంది. దానిలో ఎదో ఒక తమాషా వుండాలి. ఇదిగో వచ్చినవే డియోర్ స్ప్లిట్ గ్లాసెస్. గ్రాఫిక్ స్టయిల్ తో ఈ కళ్ళజోడు మధ్యలో వేరే రంగులో ఓ పట్టీ వుంటుంది. పట్టుకంటే అవి మాములు సన్ గ్లాసెస్సే. కానీ సరికొత్త లుక్ లో ఒక సీజన్ అని లేకుండా అమ్మాయిలు కాస్త ఎండలోకి వస్తే చాలు కళ్ళకి సన్ గ్లాసెస్ లు పెట్టేస్తున్నారు. ఇవి తప్పని సరి యాక్ససరీస్ మరి వాటిలో కొత్తదనం చూపెట్టాలనుకుంటే ఇదిగో ఇలా డియోర్ స్ప్లిట్ గ్లాసెస్ తిసేసుకోవాలి. కళ్ళను నీలలోహిత కిరణాల నుంచి నూరు శాతం కాపాడతాయి. సందేహం వద్దు.

Leave a comment