సాయంత్రం పార్టీలకోసం చక్కని టిప్స్ చెపుతోంది ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. చక్కని పార్టీకి ,మంచి వేడుక కోసం సాంప్రదాయ దుస్తులే బావుంటాయి అంటోంది నీతా బంగారు జారీ ఉన్న హాఫ్ వైట్ లేదా మ్యాడ్ కలర్స్ ఎంచుకోవాలి . ఇంకా ప్రత్యేకంగా వుండాలనుకొంటే తాజా ట్రెండ్ బ్యూటీ వర్క్ కలిగిన దుస్తులు ఎంచుకోవాలి షాంపేయిన్ వెనిల్లా క్రీమ్ కలర్స్ లో డబుల్ ఫాబ్రిక్స్ లేయర్స్ తాజా ఫ్యాషన్ ట్రెండ్ . ఇక నలుపు రంగు ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ పేస్టల్ రంగుల్లో వుండే సిల్క్ కుర్తీలు,రంగు రంగుల బూటీలున్న కాటన్ కుర్తీలు బావుంటాయి. చిలకాకు పచ్చ,రాణి పింక్ ,పసుపు రంగు ఇవీ తాజా ట్రెండ్స్ . అలాగే ఈ రోజుల్లో పెద్దలు ధరించిన దుస్తులను పోలిన దుస్తులనే పిల్లలు వేసుకోవటం ఫ్యాషన్ వాటిని ట్విన్నింగ్ అంటారు . ఈ ట్రెండ్ ఫాలో అయినా బావుంటుంది అంటారు నీతులల్లా .

Leave a comment