దుస్తులు ఎంత ఆధునికమైనవి అందమైనవి వేసుకొన్న వాటికీ తగ్గ చెప్పులు లేకపోతే లుక్ రాదు గౌన్లు ,పలాజో ప్యాంట్లూ ,జీన్స్ వేసుకొంటే ,అవి మడమల వరకు ఉంటాయి కనుక కిటన్ హీల్స్ బావుంటాయి . మాములు పార్మల్ డ్రస్ అంటే ప్యాంటు షర్టు వేసుకోవటం క్లోజ్డ్ హీల్స్ బావుంటాయి . ముదురు రంగు ఎంచుకొంటే కార్యాలయానికి సరైన ఎంపిక . పూర్తి భారతీయ స్టయిల్ చీరెలు చుడీదార్ లు ధరించి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఎత్తుమడమల చెప్పల్ బావుంటాయి . వాటిలో ముందు భాగం తెరచి వుండే ,ఓపెన్ టో రకాలు చూడముచ్చటగా ఉంటాయి . పొడవాటి గౌన్లు లేయర్డ్ స్కర్టులు నేలను తాకే రకాలు ఎంచుకొంటే పాయింట్ హీల్స్ నప్పుతాయి . వేడుకల వేళల్లో మెరిసిపోవాలంటే దుస్తులకు తగ్గ చెప్పలు వేసుకోవాల్సిందే !

Leave a comment