Categories
ఎలాంటి రసాయనాలు ఉండని సహజమైన వస్తువులతో వేసుకునే ఫేస్ ప్యాక్ చక్కని ఫలితాలు ఇస్తుంది అయితే చర్మతత్వానికి తగినట్లు ఫేస్ క్లీనర్లు మాయిశ్చరైజర్లు ఎంచుకుంటారు అదేవిధంగా ఫేస్ ప్యాక్ కోసం కూడా ఎంచుకోవాలి. ముందుగా ఫేస్ క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా తుడిచుకొని పొడి చర్మం పై ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ మందంగా వేసుకుంటే అదనపు ఫలితాలు ఉండవు. ముఖమంతా చక్కగా పల్చగా సమంగా వేసుకోవాలి. కనీసం 20 నిమిషాలు ముఖంపై ఉంచుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. ప్యాక్ క్లిన్ చేసుకున్నాక తప్పనిసరిగా మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి.