శిరోజాల ఆరోగ్యానికి గోరువెచ్చని నూనె మసాజ్ ఉత్తమ ఫలితం ఇస్తుందని అంటారు నిపుణులు. రాత్రంతా బియ్యం వేసి నానబెట్టిన నీటిని ఉదయాన్నే ఆ నీటిని పాలు తేనె కలిపి జుట్టుకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.  స్వచ్ఛమైన కొబ్బరినూనె, విటమిన్- ఇ క్యాప్సిల్ ఒక తాజా నిమ్మచెక్క తీసుకొని తేనె కలిపిన మిశ్రమాన్ని మాడుకు మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేయాలి. నానిన మెంతి గింజల పేస్ట్ కలిపిన కొబ్బరినూనెను మాడుకు అప్లై చేసి తర్వాత తలస్నానం చేయాలి గులాబీరేకులు, మునగాకు, కరివేపాకు గుప్పెడు చొప్పున తీసుకొని ఆముదం కొబ్బరి నూనె కలిపి అందులో ఈ ఆకులు వేసి మరిగించి ఆ నూనెతో తలకు మసాజ్ చేసిన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment