ఐలీడ్స్, కళ్ళ చుట్టూ ప్రేదేశం నల్లని వలయాల తో కనిపించడం  వల్ల వయస్సు పెరుగునట్లు వుంటుంది. ఇలా నలుపుకు కారణాలు అనేకం. కొందరికి వారసత్వం వల్ల కావచ్చు. నిద్ర లేమి కుడా కారణాలు కావచ్చు. దీర్ఘకాలిక ఎలర్జీలు, విటమిన్స్ లోపం, కంప్యుటర్ ముందు గంటలకొద్దీ పని చేసినా కళ్ళ చుట్టూ వలయాలు సహజంగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు రోజుకు రెండు సార్లు స్కిన్ వైటనింగ్ సీరమ్ వాడుతుండాలి. విటమిన్ సి, కోజిక్ యాసిడ్, హైడ్రోక్వినోన్ విటమిన్ కె వుండే సేరమ్ వాడాలి. క్రీమ్స్ కంటే ముఖ్యంగా చాలినంత నిద్ర పోవాలి. ఒత్తిడి తగ్గించుకుని, ప్రశాంతమైన పని చేసుకునే అలవాటు చేసుకోవాలి.

Leave a comment