Categories
నిద్ర గురించి కంప్లెయింట్ చేసే వారు, సుఖ నిద్రకు దోహదం చేసే కొన్ని ఆహార పదార్దాలు తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుంది. సోయాబీన్, గుమ్మడి గింజల్లో ట్రీఫ్టో ఫిన్లు ఉంటాయి. ఇవి మంచి నిద్ర ఇవ్వగలవని అద్యాయినాలు చెప్పుతున్నాయి. అలాగే సహజమైన మెలటోనిన్ కలిగి వుండే చెర్రీలు కుడా సుఖ నిద్రకు సహకరిస్తాయి. మెగ్నీషియం, పోటాషియం అత్యధికంగా వుండే అరటి పండ్లు కుడా చక్కని నిద్ర ఇస్తాయి. వీటిలో కుడా పుష్కలంగా ట్రీఫ్టో ఫిన్ వుంటుంది. అలాగే ఓట్ మీల్ లో కాల్షియం, మెగ్నీషియంలు పుష్కలంగా వుంది సుఖ నిద్రను కలుగ జేస్తాయి. అలాగే గ్రీన్ టీ కుడా మంచిదే.