పడక గదిలో కొన్ని రకాల మొక్కలుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఒక కొత్త పరిశోధన రిపోర్ట్ చెపుతోంది. సుగంధ మొక్కల  నుంచి వచ్చే స్వచ్ఛమైన వాసనలు ఒత్తిళ్ల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఈ హౌస్ ప్లాంట్స్ సహజమైన ప్యూరీఫైర్స్ కూడా. లావెండర్ ను సబ్బులతో సేన్టేడ్ బట్టలు షాంపూల్లో సువాసన కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్క ఇంర్లో ఉంటే ఇల్లంతా సువాసనే. కేప్ జాస్మిన్ మొక్క న్యూరో ట్రాన్స్ మీటర్ పైన ప్రభావం చూపెడతాయి. నాసా అధ్యయనంలో స్నేక్ ప్లంట్ ఇంటిలో ఆక్సిజన్ స్వచ్ఛతను మెరుగుపరుస్తుంది. ఇక వెదురు మొక్క కయితే వాతావరణంలో అన్ని రకాల రసాయనాలను  తొలగించే శక్తి వుంది. ఈ మొక్కకు ఎక్కువ సూర్యకాంతి కూడా అవసరం లేదు అలాగే మల్లె మొక్క ఇంటి ప్రాంగణంలో ఉంటే మంచి సూచన ఇస్తుంది. మంచిగా నిద్రపోయేందుకు ఈ సువాసన భరితమైన మొక్కలు ఉపయోగపడతాయి.

Leave a comment