నిద్రలేమి ఇప్పుడు ఒక సాధారణ సమస్య అయ్యి కూర్చుంది. ఇదొక ఆరోగ్య సమస్య కాకపోయినా దాని ద్వారా వచ్చే అనారోగ్యాలకు లోటు లేదు. ఈ సమస్యకు చెర్రీ జ్యూస్ తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న కొందరిని చెర్రీ జ్యూస్ రెగ్యులరుగా  ఇస్తూ పరిశీలిస్తూ వచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రాత్రి పడుకునే ముందు చెర్రీ జ్యూస్ ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత నిద్ర సమయాలను పరీక్షిస్తే గతంలో కన్నా నిద్ర మెరుగయ్యిందని తేలింది. ఈ చెర్రీ జ్యుస్ తో ఇంకెన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఈ జ్యుస్ తాగటం మంచిది అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment