కుంకుమ పువ్వు వేసి తీసిన ఎక్స్ట్రాక్ట్ తో బాగా నిద్ర పడుతుంది అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి సమస్య గురించి చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.ఇతర ఆరోగ్య సమస్యలు లేని 68 మందికి 28 రోజుల పాటు రోజుకు 14 మిల్లీ గ్రాముల చొప్పున ఈ కుంకుమ పువ్వు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ను  ఇచ్చారట వారిలో మూడు వంతుల మంది బాగా నిద్రపోయామని చెప్పారు అయితే ఇది ఏ రకంగా నిద్రను ప్రభావితం చేస్తుందో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి కానీ ఏ విధంగా చూసినా పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని త్రాగటం  అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిదే.

Leave a comment