జెర్బెరా పువ్వులు పింక్ ,ఎల్లో ,ఆరెంజ్ ,వైట్ కలర్స్ లో చాలా అందంగా ఉంటాయి. సౌత్ ఆఫ్రికా నుంచి ప్రపంచానికి పరిచయం అయినా ఈ మొక్కలో అసాధారణమైన గుణాలున్నాయి. కాస్త వెలుతురు ఉంటే చాలు ఈ మొక్క ఎక్కడైనా బతికేస్తుంది.పగలు రాత్రి ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. నిద్ర నిచ్చే మొక్క అంటారు దీన్ని. నిద్ర పట్టని వాళ్లు రెండు జెర్బెరా మొక్కల్ని పడకగదిలో పెట్టుకొంటే చాలా కమ్మని నిద్ర వస్తుంది అంటారు.వేళకి చక్కగా నీళ్ళు పోసి కాస్త శ్రధ్ధగా చూస్తే ఈ పూల మొక్క చాలా అందం ఇంటికి.చీడ పట్టకుండా వేప నూనె స్ప్రే చేస్తే చాలు.

Leave a comment