Categories
గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో వాళ్లు నిద్రించే తీరు లో జాగ్రత్తలు పాటించటం అంతే అవసరం అంటున్నారు అధ్యయనకారులు. ఇటీవల జరిపిన ఒక పరిశోధనలో గర్భిణీలు వెల్లకిలా పడుకోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణవాయువు సరిగా అందక పోవడమే కాక బిడ్డకు రక్త ప్రసరణ కూడా సరిగా జరగలేదని తేలింది. కడుపులో ఉన్న శిశువు తో పాటు గర్భం బరువు కారణంగా రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడి వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందట. అంచేత నిద్రపోయే పొజిషన్ విషయంలో గర్భిణీలు జాగ్రత్త పడాలి. ఈ విషయం గురించి డాక్టర్ తో చర్చించి ఎలా పడుకుంటే శిశువుకు అపాయం లేకుండా ఉంటుందో తెలుసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.