Categories
WoW

నిద్రలేమి దివ్యౌషధం కివి.

ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ పండు పండినా అవి మనం తినేయచ్చు. న్యూజిలాండ్ వంటి శీతల ప్రదేశాలలో సాగయ్యే పండ్ల చెట్టు కివి. ఇవి ఇప్పుడు ఏ సూపర్ బజార్ లో అయినా దొరుకున్తున్నాయి. కోడిగుడ్డులా గుండ్రంగా గోధుమ రంగులో పైనంత నూగుగా ఉండే కివిలో ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా దొరకటంతో మన దేశంలో ఎంతో ఆదరణ దొరికింది. రోజుకు రెండు చొప్పున కివి పండ్లు తింటే కంటి సంబదిత సమస్యలు అస్సలు రావని అధ్యయనాలు తేల్చాయి. స్కిన్ కాన్సర్ కి కివి చక్కని ఔషధం. యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంలో ఈ కివి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమికి కూడా మంచి మందు. విటమిన్ A, K, E, B పుష్కలంగా దొరుకుతాయి. పొటాషియం, కాల్షియంతో సహా ఎన్నో ఖనిజాలు పోషకాలు కివిలో లభిస్తాయి.

Leave a comment