హాయిగా నిద్రపో కలిగితే ఆనందమే కాస్త నిద్ర తగ్గిందంటే మానసిక సమస్యలు వస్తాయి.భావోద్వేగాలు పాజిటివ్ గా ఉంటే ప్రశాంత చిత్తంతో నిద్రలోకి జారుకుంటారు అంటారు మానసిక తత్వవేత్తలు.నిద్రకు ప్రశాంత వాతావరణం, లోపల బయట కూడా అవసరం.అతిగా ఆలోచనలు విశ్లేషణలు నిద్రకు అడ్డుపడతాయి.నేను నా శరీరానికీ  మనసుకీ విశ్రాంతి ఇవ్వదలుచుకొన్నాని పదే పదే అనుకుంటూ పడుకుంటే మెదడు దాన్ని తీసుకోగలుగుతుంది శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి జీవితంలో కష్టనష్టాలు అందరికీ ఎదురవుతాయి ఇబ్బందులు సవాలుగా స్వీకరించి స్థాయికి మనసు ఎదిగితే జీవితానికి లక్ష్యం స్పష్టంగా ఉంటే అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.శరీరం విశ్రాంతి కోరుకోగానే నిద్ర ఇట్టే వచ్చేస్తుంది. జీవితపు తాళపు చెవి మన చేతిలో ఉండాలి పగలు హాయిగా గడిస్తే రాత్రి నిద్ర వస్తుంది.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment