Categories

యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన విదేశీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎమ్.ఐ6 బ్లేజ్ మెట్రెవెలి అనే 47 ఏళ్ల మహిళను చీఫ్ గా ఎంచుకుంది 116 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్రిటిష్ ఏజెన్సీ లో ఈమె 18వ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటుంది. 1999 లో కేస్ ఆఫీసర్ గా ఇంటలిజెన్స్ సేవలో అడుగుపెట్టింది మెట్రెవెలి. ప్రస్తుత సేవల సాంప్రదాయ ప్రకారం మెట్రెవెలి’సి’ అనే పేరును ఉపయోగించుకోబోతోంది. ఈమెకు పడవ నడపటం హాబీ పడవల పందాల్లో గెలుపొందింది కూడా. చరిత్ర పరమైన సవాళ్లను ఎదురు కొనడంలో మహిళల మేధాశక్తితో పనిచేయగలదని మెట్రెవెలి నిరూపించారు.