Categories
WhatsApp

నైట్ పార్టీల్లో కొత్తలుక్ క్లచ్.

హ్యాండ్ బ్యాగ్ లేకుండా అమ్మాయిలు అడుగు బయట పెట్టరు పైగా డిస్ ప్లేలో ఏ కొత్త బ్యాగ్ కనిపించినా కోనేస్తుంటారు కానీ సందర్భానికి తగ్గట్టు బ్యాగులు కుడా చేయించుకోవాలి. ఉదాహరణకు ఏ పార్టీకొ వెళితే, అది రాత్రి వేల అయితే క్లాచ్ లు బావుంటాయి. మెరిసే దుస్తులకు సరిజోడుగా వుంటుంది క్లచ్. అయితే ఆఫీసు కు ఇవి పనికి రావు. టోటే తరహాలో హ్యాండ్ బ్యాగ్ బుజాలకు తగిలించుకునేలా లేదా చేతులతో పట్టుకునేలా వుంటే వీలుగా వుంటుంది. అయితే ఇందులో డబ్బు కార్డులు అలా పడేస్తే ఇబ్బంది. గ్రాఫిక్ డిజిటల్ ప్రింట్స్ లో వచ్చే చిన్ని పర్సు ని తీసుకుంటే అందులో ఫోను, కార్డులు, డబ్బు పెట్టుకుని బ్యాగ్ లో పదేసుకుంటే వీలుగా వుంటుంది. పార్టీలు ప్రయాణాలకు స్టయిల్ గా వుండే స్లింగ్ బ్యాగ్ లు బావుంటాయి. ఏదయినా అకేషన్ కు తగినట్లు గా ఎంచుకుంటే వీలుగా ఉంటాయి.

Leave a comment