Categories
బ్యాడ్మింటన్ ఛాంపియన్ గుత్తా జ్వాల నవజాత శిశువులకు ప్రాణాధారమైన తల్లిపాలను డొనేట్ చేయటం లో కూడా ఛాంపియన్ అనిపించుకున్నారు. ఆమె 30 లీటర్ల తల్లిపాలు దానం చేశారు. మొన్నటి ఏప్రిల్ లో ఆమెకు పాప పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన చనుబాలు 30 లీటర్లు డొనేట్ చేశారామే.నేను ఎప్పుడూ మంచి వ్యాయామం మంచి ఆహారం తీసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను ఏనాడు జంక్ ఫుడ్ తినలేదు అందుకే నాకు పాలు సమృద్ధిగా పడ్డాయి పాప కడుపు నిండాక రోజుకు అర లీటర్ పైగా నాలో పాలు పొంగుతూ ఉండేది. అవన్నీ సేకరించి నీలోఫర్ హాస్పిటల్ లో పసిపిల్లల కోసం ఇచ్చానన్నారు జ్వాల.
