తమిళ మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్న నిఖిలా విమల్. కరోనా సమయం లో వాలంటీర్ గా ఒక హెల్ప్ లైన్ సెంటర్ లో పనిచేస్తుంది.ఈమె తెలుగులో అల్లరి నరేష్ తో మేడమీద అబ్బాయి సినిమా లో నటించింది.కేరళ లోని ఒక హెల్ప్ లైన్ సెంటర్ లో ప్రజల సహాయం కోరి చేస్తున్న కాల్స్ కి అటెండ్ అవుతూ వారి అవసరాలు తెలుసుకుంటుంది. వాలంటీర్ల ద్వారా వారికి కావలసిన వస్తువులు చేరుస్తుంది అలాగే పేదల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకు పోతూ నిజమైన కథానాయక అనిపించుకుంటుంది నిఖిలా విమల్ .