Categories
కొట్టాయం వైద్య కళాశాలకు చెందిన ఈ స్టాఫ్ నర్సు ఉత్తరం ఇప్పుడు వైరల్ అవుతోంది .కరోనా బారిన పడి కోలుకొన్నారురామె .ఏకంగా కరోనా ని ఉద్దేశిస్తూ ఒక ఉత్తరం రాసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది . స్వాగతించ కుండానే వచ్చిన ప్రియ నేస్తమా.నీకు కేరళ గురించి ఇక్కడి నర్స్ ల గురించి సరిగ్గా తెలియదు .వాళ్ళు నిన్ను నిద్ర పుచ్చుతారు .నువ్వు రాకూడని ప్రదేశానికి వచ్చావు .వారం రోజుల్లో నా సహోద్యోగులు సీనియర్ డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్స్ సహకారం తో నిన్ను ఓడించి నేనీ గదిలోంచి బయటకు పొతున్నా .నా సహోద్యోగుల సహకారమే నాకు ధైర్యం .నీతో ఒంటరి పోరుతో గెలిచాను .అని ఉత్తరం రాసిందామె .ఈమెను ఆరోగ్య శాఖా మంత్రి కె.శైలజ ఎంతో ప్రశంసించారు .