ఆఫీసుల్లో అద్దాల గదుల్లో ,ఎసీల్లో కూర్చోని పనిచేయటం చాలా దర్జాగా ఉంటుంది. కాని అలా సంతోషంగా కూర్చోని చేసే పని వల్ల డయాబెటిస్,గుండె జబ్బులు వస్తున్నాయి అంటున్నాయి అధ్యాయనాలు. దీర్ఘకాలం కూర్చోని పనిచేసే వారు బరువు పెరుగుతారు. జాగ్రత్తగా గమనిస్తే కొన్ని గంటలు కదలకుండా కూర్చోని పనిచేస్తే పాదాల్లో వాపు కనిపిస్తుంది.అలా కూర్చోడం సరైన భంగిమల్లో లేకపోతే భూజం నొప్పి ,మెడ నొప్పి నడుము నొప్పు వంటివి వస్తాయి. అందుకే ఆఫీసులో పనిగంటలు ఎనిమిదిగా ఉంటే ,అందులో రెండు గంటలైన లేచి నిలబడి పని చేయలంటూ ఇటు తిరగాలని ,లేదా నిలబడి ఫైల్స్ చుసుకోనే అలవాటు పెంచుకోవాలని అధ్యయానాలు సూచిస్తున్నాయి.

Leave a comment