Categories
రోజుకు రెండు గంటల పాటు నిలబడితే 0.5 కాలరీలు తగ్గవచ్చునని అమెరికా ,స్పెయిన్ యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. రోజంతా ఎక్కువ సేపు కూర్చోని పని చేసేవారు ఎక్కువేనని పరిశోధనలు చెపుతున్నాయి. అంతసేపు కూర్చోని ఉండటం వల్ల బరువు పెరగుతారని ,వెన్ను నొప్పి వంగి సమస్యలు వస్తాయని తెలసిందే .ఈ విషయంపైన 17 నుంచి 74 ఏళ్ళు ఉన్న 2వేల మందిపైన అధ్యయనం చేసి వారందరినీ రెండు నుంచి ఆరు గంటల పాటు నిలబడి పని చేయమంటున్నారు. వీరంతా రోజులో ఆరు గంటలుపైన కూర్చోని పని చేసే వారే . కొన్నాళ్ళ తర్వాత నిలబడి పని చేయటం అలవాటు చేసుకొన్నవారు నిమిషానికి 0.5 కాలరీలు ఖర్చు చేసుకొన్నారని గమనించారు. జిమ్ లో చమటలు పట్టేలా వ్యాయామం చేసిన,నడిచినా ఇదే ఫలితం కనిపిస్తుందని తేల్చారు.