ప్రకృతిలో ఎన్నో వర్ణాలు. ప్రపంచంలో మనం సృష్టించిన ఇంకెన్నో రంగులు అలాగే కొన్ని రంగులు కలిపేస్తే ఇంకో కొత్త షేడ్ వస్తూ  ఉంటుంది. ఎన్ని కొత్త వర్ణాలు కనిపెట్టినా  దేని అందం దానిదే. ఒక కొత్త సర్వే రిపోర్ట్ లు మహిళలు నీలిరంగు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని తేలింది . ఇంతకంటే అందమైన ఇంకొటిలేదని ఎక్కువమంది తేల్చిచెప్పినట్లు రిపోర్టులు. ఇక రంగుల్ని గురించిన అభిప్రాయాలు ఎలా వున్నాయంటే 29 శాతం నీలిరంగే. మేలైన రంగన్నారు . 27 శాతం పర్పుల్ మెరుపు ఎంతో బావుందన్నారు. 19 శాతం మంది ఆకుపచ్చ అందమైన రంగన్నారు. 9 శాతం మంది బెంగాలీ ఎరుపు బావుంటుందంటే ఏడు శాతం మంది గులాబీ కి ఓటేశారు. ఆరు శాతం పసుపు వర్ణం బావుందంటే మూడు శాతం ఆరెంజ్ చక్కనిరంగన్నారు. ఇంతకీ అందమైన తెల్లని రంగుని ఎక్కువ మంది మెచ్చుకునే లేదు. ఇంతకీ ఈ రంగుల రీసెర్చ్ ఎందుకు  అంటే ఫ్యాషన్ బిజినెస్ మొత్తం ఆధారపడింది. ఈ రంగుల డిజైన్లపైనే కదా. ప్రపంచంలో ఎక్కువ బిజినెస్ జరిగేది ఫ్యాషన్ బ్యూటీ పైనే కదండీ !!

Leave a comment