లీటర్ బాటల్ నీళ్ళధర రూ 65లక్షలు.కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఈ నీళ్ళను తయారు చేస్తున్నారు. అక్కడి పర్వత శిఖరాల పై నుంచి జారిపడే నీళ్ళను చాలా అతి జాగ్రత్తగా పట్టి విటమిన్లు ఖనిజాలు కలిపి తయారు చేసే ఈ నీళ్ళు చాలా రుచిగా ఉంటాయట. ఈ నీళ్ళ సీసా కూడా ప్రత్యేకం .ఈ బాటిల్ మూత అచ్చమైన బంగారం ,చుట్టు తెల్లని వజ్రాలు పొదిగి ఉంటాయట. ఇవే కాదు ఖరీదైన నీళ్ళు అమ్మే సంస్థలు ఇంకా ఉన్నాయి. బ్లింగ్ హెచ్ టూవో,కోనా నిగరి ఫిలికో ,వీవ్ ,టెన్ థౌజండ్ బిసీ లాంటివి వేల రూపాయల ఖరీదైన నీరు అమ్ముతున్నారు. ముంబై లోని మలాకీ లగ్జరీ వాటర్ ,375 మి.లీటర్ల నీళ్ల బాటిల్ ఖరీదు ఆరువందల రూపాయలు .ఈ నీళ్ళలో బంగారు రేకులు తేలుతూ కనిపిస్తాయట.

Leave a comment