ఆధునిక జీవన శైలిని బట్టి ఇంట్లో వాడుకునే వస్తువుల రూపు రేఖలు మారిపోతున్నాయో చివరికి ఇంట్లో పెంచుకునే మొక్కల కుండీలు కూడా ఆధునిక సొగసుల్ని సరికొత్త సాంకేతిక వైజ్ఞానాన్ని కలబోసుకుని మరీ వస్తున్నాయి. బయట ఉద్యోగపు వత్తిడిలో ఇంట్లో పెరిగే మొక్కలకు నీళ్ళు పోయడం మరచిపోతే ఎలా ఆ భయం లేకుండా రోగికి గ్లుకోజ్ ఎక్కించి నట్లు గా మొక్కలకు పోషకాలతో కూడిన నీటిని అందించేలా డిజైన్ చేసిన ఐ.వి ప్లాంట్ పాట్స్ వచ్చాయి. లండన్ కు చెందిన విటమైన కంపెనీ రబ్బర్ గ్లాస్ తో రూపొందించిన కుండీలు చూసేందుకు స్టైల్ గా వుంటాయి. వీటిలో అమర్చిన లోహపు స్టాండ్ కున్న స్క్రు ద్వారా నీళ్ళు మొక్కకు చేరే వేగం నియంత్రించ వచ్చు. అలాగే లాగ్ అండ్ స్కిరల్ కుండీ వుంది. క్వాలే డిజైన్ కంపెని తాయారు చేసిన ఈ కుండీ అడగులో ఓ ఉడత వుంటుంది. నీళ్ళు పోయగానే పైకి వస్తుంది అలా వస్తే నీళ్ళు చాలని అర్ధం. ఉడత కనపడకుండా లోపలికి పొతే నీళ్ళు అయిపోయాయని గుర్తు. అలాగే నీళ్ళు ఎంతున్నాయో కనిపించేలా చేసే ప్రోలి ప్రోపిలిన్ ప్లాస్టిక్ కుండీలు గోడకు అమర్చే రెయిన్ పోట్ లు ఎన్నో రకాలు. ఇంటి అలంకరణ ఇష్టంగా చేసేవాళ్ళు వెతకలే కనీ బోలెడన్ని రకాలు.
Categories
WoW

నీళ్ళు ఎన్ని కావాలో చెట్టే అడుగుతుంది

Leave a comment