ఒంట్లో నీరు తగ్గితే ఏకాగ్రత లోపిస్తుంది. విషయాలు తేలిగ్గా మర్చిపోతారంటున్నారు అధ్యయకారులు. శరీరంలో నీటిశాతం తగ్గితే మెదడుకు కూడా నీటి కొరత ఏర్పడుతుంది. అంతే కాదు ఒంట్లో నీరు తగ్గతే మెదడుకు ఆకలి వేస్తుందని తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం కూడా వుంది. అందుకే ఆకలి వేస్తోంది అనిపిస్తే ముందుగా మంచినీళ్ళు తాగాలి. సాధారణంగా వాతావరణం చల్లగ వుంటే దాహం అని పించదు. అలా అని నీళ్ళు తాగకపోతే జీవనక్రియలు కుంటుపడి వేరే సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ తో నోరు దుర్వాసన రావచ్చు లాలాజలంలో యాంటీ బాక్టీరియల్ గుణాలు వుంటాయి. ఎపుడైతే నీరు తక్కువ అవుతోందో నోరు పొడిబారిపోయి దుర్వాసన మొదలవుతుంది కూడా. అందుకే గంటకోసారి గ్లాసు మంచినీళ్ళు తాగేతే సరి.

Leave a comment