నిమిషాల్లో చేసుకోగలిగిన బ్రేక్ ఫాస్ట్ లు చాలా నే ఉన్నాయి పెసలు శనగలు పల్లీలు వంటివి నీళ్ళలో నాననిచ్చి మొలకలు వచ్చేలా చేసే వాటి పైన ఉప్పు మిరియాల పొడి చల్లుకోవచ్చు వేయించి ఉప్పు కారం వేసుకోవచ్చు. అటుకుల ఉప్మా కు ఎక్కువ సమయం పట్టదు. బ్రౌన్ బ్రెడ్ జామ్ తో సాస్ తో తినచ్చు. ఉల్లి, క్యాప్సికం కొత్తిమీర సన్నగా తరిగి స్లైస్ ల మధ్య పెట్టుకొని తినచ్చు. కొన్ని పాలు వేడి చేసి అందులో అటుకులు బెల్లం కలిపి తిన్న మంచిదే. ఉడికించిన ఓట్స్ లో మజ్జిగ కలుపుకోవచ్చు పాలల్లో ఓట్స్ అంజూర్, ఎండుద్రాక్ష, జీడిపప్పు కూడా ముక్కలు చేసి వేసుకోవచ్చు. రుచికరమైన పాయసం లా ఉంటుంది. యాపిల్, ఖర్జూరం, ద్రాక్ష వంటివి తిన్నా చాలా ఆరోగ్యం అంతేగాని ఖాళీకడుపుతో భోజనం చేసే వరకు ఉంటేనే అనారోగ్యం.

Leave a comment