అస్సలు కష్టపడకుండా నిమిషాలపైన సూప్ తాగాలని వుందా? అయితే ఎలక్ట్రిక్ సూప్ మేకర్ ఫీచర్స్ ఓసారి చూస్తే సారి. ఇందులో మిక్సీ జార్ వుంటుంది. సూప్ కి కావాల్సిన కూరగాయలు, దినుసులు, నీళ్ళు వేసి అవి ఎంత మెత్తగా ఉండాలో బటన్లు చూసి నొక్కితే చాలు. జార్ కాస్తా కూరగాయల్ని అదే ముక్కలుగా కట్ చేసుకుని తర్వత మనం సెట్ చేసినంత మెత్త మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి ఉడికించేస్తుంది. మనకు బీప్ శబ్దం వినబడితే చాలు సూప్ రెడీ అని తెలిసిపోతుంది. ఈ వర్షాల్లో ఏ నిమిషంలో అయిన వేడి వేడి పొగలు గక్కే సూప్ తాగాలని అనిపిస్తే ఈ ఎలక్ట్రిక్ సూప్ మేకర్ నిమిషాల్లో సూప్ సిద్ధం చేస్తుంది. మనం అలా తీసుకుని తాగేయడమే.

Leave a comment